మనవార్తలు ప్రతినిధి :
భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన భారతీయ ఐక్యత, ప్రగతిని ప్రదర్శించేందుకు భారతీయులంతా కలిసి రావాలని ఈ కార్యక్రమం నిర్వహించేందుకు భారతీయ అమెరికన్ కమ్యూనిటీ, న్యూయార్క్ నగరంలోని భారత కాన్సులేట్ జనరల్ మద్దతుతో న్యూజెర్సీలోని న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు ఆలయం పిలుపునిస్తోంది. న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు ఆలయం (సాయి దత్త పీఠం) ఈ ‘వికసిత భారత్ రన్ ను ఘనంగా నిర్వహించడానికి సిద్ధమైంది. మన మాతృభూమి సాధించిన అద్భుత ప్రగతిని, ముఖ్యంగా 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశం సాగిస్తున్న చారిత్రక ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ పరుగులో భారతీయ అమెరికన్లంతా పాల్గొనాలని సాయిదత్త పీఠం కోరుతోంది.
భారత్-అమెరికా మైత్రిని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ రన్ ఒక వేదికగా మారనుంది. స్థానిక, జాతీయ ప్రవాస భారతీయ సంస్థలను కలుపుకుని సాయిదత్త పీఠం ఈ రన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. వికసిత భారతలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంత కీలకం అనేది ఈ రన్ ద్వారా చాటి చెప్పనుంది.