చిట్కుల్
పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో శుక్రవారం విజయదశమి వేడుకలను ఘనంగా జరిగాయి దసరా పండుగను పురస్కరించుకొని సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి, వేణుగోపాల స్వామి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. కోవిద్ నిబంధనలు పాటిస్తూ వేడుకలను జరుపుకున్నారు.జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ , ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బిజెపి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుంకరి రవీందర్, పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు చాకలి వెంకటేష్, వార్డు సభ్యులు ఆంజనేయులు, భుజంగం, శ్రీను, ఒగ్గు శ్రీను, మురళి, వల్లెపు వెంకటేష్, డేగల కృష్ణ, మాజీ ఎంపిటిసి వీరస్వామి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.