మనవార్తలు , శేరిలింగంపల్లి :
నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను పముఖ సామాజిక వేత్త, టీఆరెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ శుక్రవారం రోజు హఫీజ్ పెట్ లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే నాయకులకు, అధికారులుకు, ప్రజలకు, పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక విలేకరులు నర్సింలు ముదిరాజ్, వరుణ్ లు పాల్గొన్నారు.