చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం..
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వడ్డే ఓబన్న సేవలు గొప్పవని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ నీలం మధు క్యాంపు కార్యాలయంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్య మిత్రుడిగా ముఖ్య అనుచరుడిగా, సేనాధిపతిగా చిన్న, సన్నకారు రైతులను వేధిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం పై తిరుగుబావుట ఎగురవేసిన మహనీయుడు వడ్డే ఓబన్న అన్నారు.నేటి తరం ఆ మహానియుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు,ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు మంజలి దస్తగిరి,అశోక్, కుప్పస్వామి,అభిరామ్, భీమయ్య, హనుమత్, మహేష్, ప్రవీణ్, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…