జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ వెయ్యండి…
– వ్యాక్సినేషన్ సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
– బిజెపి ఓబిసి మోర్చారాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్
పటాన్ చెరు:
కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తిస్తే, రాష్ట్రప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని, వ్యాక్సినేషన్ విషయంలో జర్నలిస్టులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ… కోరినా సెకండ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అటు ఫ్రంట్ లైన్ వారియర్స్ జర్నలిస్టులు, ఇటు ప్రజలకు సరైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. జర్నలిస్టులు తమ విధుల్లో భాగంగా రోజు ఆస్పత్రిలో ,ఇతర చోట్ల వార్తా సేకరణలో భాగంగా తిరుగుతుంటారు అలాంటి వారికి వ్యాక్సినేషన్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కరోనా కేసులు తగ్గుతున్నాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి గాంధీ ఆస్పత్రికి, కింగ్ కోటి ఆసుపత్రికి ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చి కేసులు చూస్తే తగ్గినాయా లేదా పెరిగినాయ తెలుస్తుందన్నారు. ఒకవైపు జర్నలిస్టులు మృత్యువాత పడుతుంటే, మిగతా జర్నలిస్టు భయభ్రాంతులకు గురవుతున్న రాష్ట్రప్రభుత్వం కనీసం వ్యాక్సినేషన్ వేయకపోవడం సిగ్గుచేటన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ మే ఒకటో తేదీ నుండి వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించిన రాష్ట్రంలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.