పటాన్చెరు
మత సామరస్యానికి ప్రతీక ఉర్సూఉత్సవాలని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పటాన్చెరు పట్టణంలోని హజరత్ నిజాముద్దీన్ దర్గా లో నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం టిఆర్ఎస్వి నాయకులు సోహైల్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పంకా ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక చదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు విజయ్ కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.