మనవార్తలు,హైదరాబాద్:
జల వనరుల సంరక్షణ కోసం భగీరథడిలా కృషి చేయాలని వర్ధమాన కవి సీనియర్ జర్నలిస్టు మోటూథి నారాయణరావు కవిత గానం చేసి రసజ్ఞులైన సాహిత్య అభిమానులను కవులను ఆకట్టుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం జలమండలి మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో *భూగర్భ జల పరిరక్షణ కవితోత్సవం ను ఆదివారం సెంట్ థెరిస్సా బాలికల ఉన్నత పాఠశాల ఎర్రగడ్డ లో జరిగిన కవి సమ్మేళనం జరిగింది.ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన యువ కవి మోటూరి నారాయణరావు కవి సమ్మేళనం లో పాల్గొని నీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ,మరియు నీటి యొక్క ఆవశ్యకత పై ,భవిష్య కార్యాచరణపై సూచనలు అందిస్తూ కవితా గానం చేసి సభికుల్ని ఆకట్టుకున్నారు .
ఈసందర్భంగా నిర్వహకులు *మోటూరి నారాయణరావు కు జల మండలి,గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వారు, ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ , గాంధీ జ్ఞాన్ సంస్థ అధ్యక్షులు డా గున్న రాజేందర్ రెడ్డి తదితరులు,జలమండలి జనరల్ మేనేజర్ ఎస్ హరి శంకర్,కవి బండికారి బాలాజీ, ముదిగొండ సంతోష్ కుమార్ శర్మ,మూర్తి శ్రీదేవి,గరిమెళ్ళ తులసీ వెంకట రమణా చార్యులు,వేదార్థం మధుసూదన్ శర్మ, కొండా మోహన్, రామకృష్ణ చంద్రమౌళి, పోలయ్య కవి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు