విద్యా పరిశోధన కోసం గీతం ఫ్రొఫెసర్ కు యూకే ఆహ్వానం

Telangana
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ సెన్స్టిలోని గణిత శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ మోతహర్ రెజా ఈనెల 1 నుంచి 15 తేదీ వరకు విద్యా పరిశోధన చేపట్టడానికి యునెటైడ్ కింగ్డమ్ (బ్రిటన్)లోని డూండీ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సెన్ట్స్ అండ్ ఇంజనీరింగ్ ఆహ్వానించింది.యూనివర్సిటీ ఆఫ్ డూండీలోని ఎన్విరాన్మెంటల్ ఫ్యూయిడ్ మెకానిక్స్ లెక్చరర్ డాక్టర్ అనిర్బన్ గుహా ‘స్లిప్వాల్ ఎఫెక్ట్స్ ఆన్ మెక్రోచానెల్ ఫ్లూయిడ్ స్టెబిలిటీ అండ్ బయోమెడికల్ డివెస్ట్ అప్లికేషన్స్’ అనే అంశంపై పరిశోధన చేపట్టేందుకు డాక్టర్ రెజాను ఆహ్వానించారు. ప్రొఫెసర్ రెజా పర్యటనకు భారత ప్రభుత్వ సంస్థ సెర్చ్ లోని గణితపరిశోధన ప్రభావం కేంద్రీకృత మద్దతు (మాట్రిక్స్) కార్యక్రమం ద్వారా ఆర్థిక సౌజన్యాన్ని అందిస్తోంది. విదేశాల్లోని విశ్వవిద్యాలయాలతో పరిశోధన సహకారాన్ని పెంపొందించడం, గీతం హెదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగాన్ని మరింతప్రోత్సహించడం లక్ష్యం డాక్టర్ రెజు ఈ పర్యటనను చేపట్టారు. ఈ సహకారం ఆయన పరిశోధన పురోగతికి గణనీయంగా దోహదపడుతుందని, అదనపు నిధుల అవకాశాలను సృష్టించగలదని భావిస్తున్నారు. ఈ ఏడాది డాక్టర్రెజా నాలుగు వ్యాసాలను ప్రముఖ సెంటిఫిక్ జర్నళ్లలో ప్రచురించడం పరిశోధన పట్ల ఆయన నెపుణ్యం, అంకితభావాన్ని తెలియజేస్తోంది.డాక్టర్ రోజాకు దక్కిన ఈ గౌరవం పట్ల గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం, గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేశ, సిస్ట్స్ డీన్ ప్రొఫెసర్ కొల్లూరు శ్రీకృష్ణ, మేనేజ్మెంట్ డీన్-పరిశోధన డెరైక్టర్ డాక్టర్ రాజా ఫణి పప్పు, వివిధ విభాగాల అధిపతులు, సహోధ్యాపకులు పలువురు హర్షం వెలిబుచ్చడమే గాక, ఆయనను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *