_పటాన్చెరువు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలుగు ప్రజల నూతన సంవత్సరానికి మొదటి పండుగ ఉగాది పర్వదినాన్ని ఏప్రిల్ 9వ తేదీన నిర్వహించుకోవాలని పటాన్చెరు పట్టణంలోని పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించారు. సోమవారం పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరయ్యారు. వేద పండితుల సూచనలకు అనుగుణంగా.. మార్చ్ 25న హోలీ పండుగ, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 15 నుండి 19 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పర్వదినాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జైపాల్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపానా దేవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.