రెండు లడ్డూ లు రూ.11 లక్షల 7 వేలు..

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు పట్టణంలోని జేపీ కాలనీలో యంగ్ లయన్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం గణేష్ మండపం వద్ద జరిగిన లడ్డూ ల ప్రసాదం వేలం పాట పోటాపోటీగా సాగింది మొదటి లడ్డూను పటాన్‌చెరు పట్టణం చెందిన పెద్ద బోయిన ప్రవీణ్ ముదిరాజ్ రూ. 3 లక్షల 56 వేలకు, రెండో లడ్డును ముదిరాజ్ బస్తికి చెందిన నాగసాని మోహన్ ముదిరాజ్ రూ. 7 లక్షల 51 వేలకు లడ్డూ ల ను వేలం పాటలో దక్కించుకున్నారు. లడ్డును దక్కించుకున్న వారిని యూత్ సభ్యులు సన్మానించి ,లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ లయన్స్ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *