మనవార్తలు ,పటాన్చెరు:
టీఆర్ఎస్ కెవి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన బి.వి. శివశంకరరావు మంగళవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలను కార్మికులకు అందేలా కృషి చేయాలని సూచించారు. కార్మికుల ప్రజా సమస్యలపై పరిష్కారానికై నిరంతరం పాటుపడాలని అన్నారు. ఎల్లప్పుడూ కార్మికుల మధ్యనే ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ కెవి అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. శివశంకర్ రావు ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు.