_రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,పటాన్చెరు:
టిఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా నిలుస్తున్న కార్యకర్తలను అనునిత్యం అండగా నిలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకే పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని భారతి నగర్ డివిజన్ పరిధిలోని మ్యాక్ సొసైటీకి చెందిన మండ గంగమ్మ, బొల్లారం మున్సిపాలిటీకి చెందిన కొల్లని శంకర్లు టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తలు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో టిఆర్ఎస్ పార్టీ ద్వారా అందించిన ప్రమాద బీమా ద్వారా రెండు లక్షల రూపాయల చొప్పున బీమా మొత్తం మంజూరు అయింది.బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా మృతుల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అన్నారు. కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, సర్కిల్ అధ్యక్షులు పరమేష్ యాదవ్, జిన్నారం మండల అధ్యక్షులు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…