మనవార్తలు , పటాన్ చెరు:
అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్థానంలో నూతన రాజ్యాంగ అవసరం అని మాట్లాడిన కేసీఆర్ మాటలు అర్ధ రహితం అని అందుకు నిరసనగా పటాన్ చెరు తెలంగాణ మాల యువసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలభేషేకం చేశారు. అనంతరం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు, తెలంగాణ మాల యువసేన నాయకులు అనంతరం తెలంగాణ మాల యువసేన రాష్ట్ర కార్యదర్శి గాలి బాబురావు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ దయ వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు అని అందులో పొందు పరిచిన ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్టం ఏర్పాటు అయింది అనికేసీఆర్ చాలా సార్లు చెప్పారు .సీఎం వ్యాఖ్యలు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగొద్దనేలా ఉన్నాయని విమర్శించారు.
కేసీఆర్ వ్యాఖ్యలతో బడుగు బలహీనవర్గాలపై కేసీఆర్కున్న ద్వేషం బయటపడిందని అన్నారు .అంబేద్కర్ అంటే ఎందుకంత విదేశ్వము చెప్పాలని కేంద్రం అంటే కేసీఆర్ కి భయం లేదు కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ అంటేనే భయం ఎందుకో రాజ్యాంగం తిరిగి రాయాలన్న వ్యక్తి తెలంగాణ సీఎంగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. ఆయనపై దేశ ద్రోహం కేసు పెట్టాలని గాలి బాబురావు అన్నారు .కేసీఆర్ పై ఎస్సి ,ఎస్టీ,బిసి ,ముస్లిం మైనార్టీలు సమాజానికి క్షమాపణలు చెప్పాలని ,లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలంగాణ మాల యువసేన నాయకులు డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో యం .మల్లేష్ , సమయ్య ,బి.గోపాల్ ,ఎన్ .సత్యం , రాజు ,ప్రసాద్ తెలంగాణ మాల యువసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.