తోషిబా కార్మికుని కుటుంబానికి తోటి కార్మికుల అపన్న హస్తం

politics Telangana

కూతురి వైద్యం కోసం కార్మికుల ఆర్థిక చేయూత

యూనియన్ అధ్యక్షులు సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ కు 7,02,374 రూపాయల చెక్కు అందజేత

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఆపదలో ఉన్న కార్మికుని కుటుంబానికి తోటి కార్మికులు మేమున్నామంటూ తోడుగా నిలబడి అపన్న హస్తం అందించారు. వివరాల్లోకి వెళితే మండలంలోని రుద్రారం శివారులో గల తోషిబా పరిశ్రమ యూనిట్ 11లో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు కాప చిరంజీవి కూతురు జోసెలిన్ జాయ్(8) గత కొంతకాలంగా తలసేమియా వ్యాధితో బాధ పడుతుండడంతో నల్లగండ్ల లోని అమెరికన్ ఒంకాలజి ఇన్స్టిట్యూట్ లో చూపిస్తున్నారు. కాగా వైద్యులు చికిత్స ఖర్చులు చాలా వరకు అవుతాయని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కార్మికుని కుటుంబానికి తోషిబా యూనియన్( సిఐటియు)ఆధ్వర్యంలో కార్మికులంతా మేమున్నామంటు ముందుకు వచ్చి 7,02,374 లక్షల రూపాయలు పోగు చేశారు. చేసిన ఆ అమౌంటును శనివారం పరిశ్రమలో యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్, జనరల్ సెక్రటరీ అర్ అనంతరావు యూనియన్ నాయకుల సమక్షములో చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత కార్మికుడు చిరంజీవి మాట్లాడుతూ మా అమ్మాయి ఆపరేషన్ కోసం నాతోటి కార్మిక మిత్రులు ముందుకు వచ్చి ఇంత పెద్ద మొత్తం సహాయం అందించిన కార్మిక సంఘం నాయకులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాసరెడ్డి,తిరుపతి,కే.శ్రీనివాసరెడ్డి,పి. శ్రీధర్,కే సత్యనారాయణ,కే శ్రీనివాస్, ఎల్ కృష్ణయ్య,శ్రీనివాసరెడ్డి,తోషిబా యూనిట్ల కు చెందిన యూనియన్ నాయకులు తదితరు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *