తెల్లాపూర్ మునిసిపాలిటి లో నెలకున్న సమస్యల పరిష్కారానికి సీయం కేసీఆర్ ను కలిసేందుకు – జగ్గారెడ్డి

Districts politics Telangana

మనవార్తలు ,తెల్లాపూర్

తెల్లపూర్ మున్సిపాలిటీలో నెల కొన్న సమస్యల పరిష్కారానికి సీఎం కెసిఆర్ ను కలిసేందుకు తాను సిద్ధమని టీపిసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.సంగారెడ్డి జిల్లా ‌రామచంద్రాపురం మండలం తెల్లపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ భరత్ కుమార్, బానురి మంజుల పావని రవీందర్ సరిత శ్రీనివాస్ రెడ్డి మయూరి రాజు గౌడ్ రామ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తెల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు మరియు నాయకులు బాలయ్య కృష్ణ ప్రభాకర్ రెడ్డి వడ్డే నర్సింహ సుధాకర్ రెడ్డి గాండ్ల శ్రీనివాస్ అరుణ్ గౌడ్ బాబు గౌడ్ శ్రీనివాస్ రెడ్డి గుల్లి రవి ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని తెల్లపూర్ పాటు ఉస్మాన్ సాగర్, కొల్లూరు ,నాగులపల్లి, వెలిమెల గ్రామాలలో మౌలిక వసతుల కల్పన, గ్రామనికి 10 ఎకరాల భూమి ఈ ప్రాంతంలో ఉన్న మూడు చెరువులను శుభ్రం చేసే విధంగా ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడురోజులుగా నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ కంటెస్డెడ్ ఎంపీ గాలి అనిల్ కుమార్ తో కల్సి వచ్చి మద్దతు పలికారు. ‌

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులను ,కుంటలను కాపాడుతామని అనేక సందర్భాల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పడం జరిగిందని, ఈ ప్రాంతం లో ఉన్న మూడు చెరువులు కూడా కలుషితం అవుతున్నాయని, వాటిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.తెల్లాపూర్ ప్రజల కనీస అవసరాలకు 2 ఎకరాలు ఇచ్చారని, కానీ స్థానిక ప్రజలు 10 ఎకరాలు అడుగుతున్నారని ప్రభుత్వం వెంటనే గ్రామావసరాలకు 10ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు.

త్వరలో దీక్ష చేస్తున్న నాయకులను గాంధీభవన్ కి పిలిపించుకునిఈ ప్రాంత ప్రజల డిమాండ్ పై రాష్ట్ర ప్రభుత్వానికి ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ,జిల్లా మంత్రికి లెటర్ లు రాస్తామని,అపోయింట్మెంట్ ఇస్తే సీఎంని కలిసి సమస్య వివరిస్తామని అన్నారు. ప్రభుత్వం స్పంథించకపోతే ప్రగతి భవన్ ముందు కూర్చుని దీక్ష చేస్తామన్నారు. ఏడు రోజుల రిలే నిరాహారదీక్షలకు కరోనా నిబంధనలు అడ్డంకిగా మారటంతో ప్రభుత్వ నిబంధనల మేరకు ఆర్ సీపురం పోలీసులు దీక్షా శిబిరానికీ చేరుకుని నిరసన దీక్షలు చేస్తున్న కౌన్సిలర్లను, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ను మద్దతు దారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు . అనంతరం స్వంత పుచి కత్తు పై విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *