పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
ముదిరాజ్ ఐక్యతను చాటేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించి ముందుకు నడవాలని ముదిరాజ్ మహసభ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీబండ ప్రకాష్ తెలిపారు . సోమవారం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ను కలిసి తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం విభాగం క్యాలెండర్ ను ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఆధ్వర్యంలో ఐటీ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, గిరిజనాభివృద్ది శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్ ,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ కలిసి శాసనసభ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు ప్రజలు బీఆర్ఎస్ వెంబడే ఉంటారని తెలిపారు .ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పుల్లిమామిడి రాజు,టిఎంఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీను,టిఎంఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్,తదితరులు పాల్గొన్నారు