గీతమ్ లో  త్యాగరాజ ఆరాధనోత్సవం 

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ ఎస్ ) లోని ఫైన్ అండ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ స్వరకర్త త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, జీఎస్ హెచ్ ఎస్ డైరక్టర్ సన్నీ గోస్మాన్ జోస్ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ, మనోహరమైన ప్రదర్శనల పట్ల తన హర్షాతిరేకాలను వెలిబుచ్చారు. త్యాగరాజ పంచరత్న కృతులలోని అద్భుతమైన రాగాలతో ప్రేక్షకులను లీనం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఆనంద మురళి, శ్వేత ప్రసాద్, కె.చంద్రరావు, లాస్య ప్రియ, మనోజ్ఞ, జ్యోతర్మయిల మృదు మధుర గాత్రానికి జీఎస్ హెచ్ ఎస్ అధ్యాపకులు  డాక్టర్ వైలలితా సింధూరి, డాక్టర్ సింధూజ, యోషిత బుద్ధ (కూచిపూడి), డాక్టర అక్షయ జనార్దన్ (భరతనాట్యం), డాక్టర్ మెథైలి అనూస్ (మోహినీయాట్టం)ల నృత్య ప్రదర్శనలు తోడే సంగీత కచేరీ ఆహుతులందరినీ విశేషంగా అలరించింది. చప్పట్లతో ప్రాంగణమంతా ప్రతిధ్వనించింది.వాయిద్యకారులు ఐ.ఏ. రేణుకా ప్రసాద్, టీ.పీ.బాలసుబ్రహ్మణ్యం (మృదంగం), కేఎల్ఎన్ మూర్తి (వయొలిన్), ఆనంద మురళి (గానం) తో సహకారం అందించారు. త్యాగరాజ స్వరకల్పనల అందం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ సాగిన ఈ ఆరాధన విజయవంతంగా ముగిసి, ప్రేక్షకులకు ముధురానుభూతిని మిగిల్చింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *