మన ఊరు మనబడి ద్వారా.. ప్రభుత్వ విద్యాసంస్థలకు కొత్త రూపు..

politics Telangana

_కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతులు

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి పథకం విద్యారంగంలో విప్లవత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి పథకం ద్వారా 51 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పునర్నిర్మాణ పనులను స్థానిక ప్రజా ప్రతినిధితో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో తిరుగుతూ చేపట్టిన అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. ఆధునిక వసతులతో.. ఆకర్షనీయమైన రంగులతో.. అనాధకరమైన వాతావరణం ఉట్టిపడేలా మౌలిక వసతులు ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ ఆనందం వ్యక్తం చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే ఏమి వస్తుందో తెలియజెప్పడానికి మన ఊరు మనబడి పథకం ఒక స్పష్టమైన ఉదాహరణ అని అన్నారు. గత ప్రభుత్వాల హాయంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విద్యా రంగం.. నేను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం పోటీ పడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని అన్నారు.

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 55 ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మనబడి పథకం ద్వారా పనులు ప్రారంభించడం జరిగిందని, వచ్చే విద్యా సంవత్సరం లోపు పనులు పూర్తవుతాయని తెలిపారు.కార్పొరేట్ పాఠశాలల్లో లక్షల రూపాయలు ఫీజులు చెల్లించే బదులు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయలు ఖర్చు చేస్తోందని, శ్రద్ధతో చదువుకొని పటాన్చెరు నియోజకవర్గానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకుని రావాలని కోరారు.అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు.విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బాలమణి శ్రీశైలం, ఎంపీటీసీలు శ్రీశైలం, అంజిరెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో బన్సీలాల్, పంచాయతీరాజ్ డి ఈ సురేష్, మండల విద్యాశాఖ అధికారి రాథోడ్, భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *