పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామ సమీపంలోని గణేష్ గడ్డ దేవాలయంలో గురువారం సాయంత్రం నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా మూడు లడ్డూ లను వేలంపాట నిర్వహించారు. పోటాపోటీగా సాగిన ఈ వేలంలో మొదటి లడ్డూను సంగారెడ్డికి చెందిన మహేష్ రూ. 3 లక్షల 80 వేలకు, రెండో లడ్డు మూడో లడ్డును శంకర్ పల్లి కి చెందిన సాయిదీప్ రెడ్డి రూ. 2 లక్షల 80 వేల కు, మూడో లడ్డును నర్సాపూర్ తునికి చెందిన నారాయణరెడ్డి రూ. ఒక లక్ష 70 వేల కు దక్కించుకున్నారు. దీంతో మొత్తం మూడు లడ్డులకు రూ. 7 లక్షల 80 వేలు వచ్చాయి. అనంతరం ఆలయ ఈవో మోహన్ రెడ్డి ,జూనియర్ అసిస్టెంట్లు మల్లికార్జున్ రెడ్డి, ఈశ్వర్ అర్చకులు సంతోష్ జోషి చంద్రశేఖర్ జగదీశ్వర్ స్వామి అయ్యప్ప సతీష్ లు లడ్డూలను దక్కించుకున్న వారిని శాలువాతో ఘనంగా సత్కరించి లడ్డూలను అందజేశారు.