మనవార్తలు , బొల్లారం
దేశ ప్రధాని నరేంద్ర మోడీ పైన హత్యే చెయ్యాలని లనుకున్నా వాళ్ళను దేశద్రోహులుగా వెంటనే వారిని శిక్షించాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి రెడ్డి అన్నారు .బిజెపి రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు సోమవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ మహిళ మోర్చ అధ్యక్షురాలు డి. స్రవంతి నరసింహ రెడ్డి అధ్వర్యంలో గడ్డపోతరం గ్రామం గాలి పోచమ్మ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యలతో వుండాలని కోరుతూ బిజెపి కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు స్రవంతి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ధర్మ న్యాయ మార్గంలో నడిపిస్తూ, దేశ అభివృది కోసం ఏళ్ల వేళల కృషిచేస్తున్నరని , నరేంద్ర మోడీ దేశానికే ఆదర్శమని ,రాబోయే ఎలక్షన్స్ లో తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు .
