_ కోటి బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
_ బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్న జీవితాల్లో వెలుగులు నిండాయన్న కేటీఆర్
_రేపటినుంచి మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపీణీ
మనవార్తలు ,హైదరాబాద్: తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపీణి రేపటినంచి ప్రారంభించనున్నట్లు మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన ఉభయతారక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్టు కెటిఅర్ తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం రేపటి నుంచి (22వ తేదీ) నుండి ప్రారంభం అవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల అద్వర్యం బతుకమ్మ చీరల పంపీణి అవుతుందని మంత్రి కెటిఅర్ తెలిపారు. చీరల పంపీణీ కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెకర్లతో సమన్వయం చేసుకుంటూ, తమ టెక్స్ టైల్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా సంక్షోభంలో చిక్కుకున్న నేతన్నలకు ఒక గొప్ప భరోసా వచ్చిందని.. వారి వేతనాలు రెట్టింపు అయ్యాయని, తద్వరా వారు తమ కాళ్లపైన తాము నిలబడే పరిస్ధితికి చేరుకున్నారని కెటిఅర్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఉపాధి లేక ఆగమైన నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. బతుకమ్మ చీరెల పంపిణీ తో అటు ఆడబిడ్డలకు ఆనందంతో పాటు ఏడాది పొడవునా నేతన్నలకు ఉపాధి భరోసా దొరికిందని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు తర్వత బతుకమ్మ చీరల వంటి వినూత్నమైన కార్యక్రమాలతో నేత కార్మికుల ఒకవైపు అదుకునే ప్రయత్నం చేస్తుంటే, టెక్స్టైల్ ఉత్పత్తులపైన జీఎస్టీ వంటి నిర్ణయాలతో నేతన్నలను నిలువునా ముంచే నేత కార్మికుల వ్యతిరేక చర్యలను కేంద్రం తీసుకుంటుందని కేటీఆర్ అన్నారు. కేంద్రం నేతన్నలను, వారి పరిశ్రమను, వారి జీవితాలను పట్టించుకోకున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేతన్నలకు కోసం తాము నిరంతరం నిబద్దతతో పనిచేస్తామని కేటీఆర్ అన్నారు.