గద్వాల
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామం లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి గుడిసెలో నిద్రిస్తున్న పేద కుటుంబంలో లో 5 మంది ప్రాణాలు కోల్పోయారు మోసయ్య శాంతమ్మ అనే దంపతులు అలాగే ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది ఇద్దరు పిల్లలు గాయాలు పాలవడం జరిగింది చాలా పేదరికంలో ఉన్నారు అయితే ముఖ్యంగా ఇండ్లు చాలా దారుణంగా ఉన్నాయి ఎస్సీ సబ్ప్లాన్ కింద 24000 కోట్లు ఖర్చు పెడుతున్నారు .
ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నావి నాకు అర్థం కావట్లేదు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది ఈ బంగారు తెలంగాణ అలంపూర్ నియోజకవర్గంలోని చాలా మంది ప్రజలు ఇండ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరీ ముఖ్యంగా పిల్లలకు చదువు లేదు అన్ని పార్టీలకు ఓటు వేశారు కానీ ఏ పార్టీ చదువు గురించి పట్టించుకోలేదు. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారిని ఈ అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం నుంచి అడుగుతున్నాను మీ ఇండ్లు కూడా ఇలాగే ఉన్నాయ వాస్తు బాగాలేదని వందల కోట్లతో కడుతున్న సచివాలయం ప్రగతి భవన్ ల బదులు ఈ నిరుపేదలకు ఇల్లు కట్టించి ఉంటే ఈరోజు ప్రాణాలు పోయే ఉండేవి కాదు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులకు కు సచివాలయాలకు కట్టడం లో పెట్టిన శ్రద్ధ నీరుపేదల ఇళ్ల పైన లేదు డబల్ బెడ్ రూమ్ అనే పథకం ఊసేలేదు ఏం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు ఆపేసి తెలంగాణలో ఉన్న ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేస్తున్నాం.
అదేవిధంగా ఎంత మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎవరు కట్టించారు శ్వేత పత్రాలు విడుదల చేయాలి లేకపోతే బహుజన సమాజ్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం బహుజన సమాజ్ వాది పార్టీ అధికారంలోకి వచ్చినాక బహుజన సమాజంలో ఇలాంటి ఇల్లు ఎక్కడ కూడా కనిపించకుండా చక్కటి నివాసం కలలో ఇల్లు కట్టించి అంతవరకు నేను నిద్రపోను మీలాగా కాంట్రాక్టర్లు కమిషన్లు ప్రభుత్వాలు కావు మావి పేద ప్రజల సంక్షేమం కోసం కూడా మనుషులుగా చూసే సమాజవాది పార్టీ మాది దయచేసి ఇక్కడున్న ప్రజలు కూడా గమనించగలరు అని ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే మన బతుకులు బాగు పడతాయని ఆయన అన్నారు