నన్ను చంపడానికి కుట్ర చేస్తున్నారు_ఈటల రాజేందర్

Hyderabad politics

వరంగల్

హుజురాబాద్ లో ఓడిపోతామన్న భయంతో టిఆర్ఎస్ నేతలు చిల్లర పనులు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూసే వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలం బత్తినివాని పల్లె ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజా దీవెన పాదయాత్ర మొదలు పెట్టారు ఈటల. తన పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడని.ఈ విషయం ఓ మాజీ నక్సలైట్ ద్వారా తెలిసిందన్నారు ఈటల.నాడు నరహంతకుడు నయీమ్ చంపుతా అంటేనే భయపడలేదని..ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని అన్నారు.అన్నం పెట్టుకోవడానికి తెచ్చుకున్న సామానులు కూడా తాళం వేశారని.. ఇదేం సంస్కృతి అన్నారు.

దళితబంధును స్వాగతిస్తున్నామని. ఎన్నికల కోసం పథకాలు తీసుకొచ్చుడు కాదు..ప్రతి నియోజకవర్గంలోపదివేల మందికి లబ్ధి జరిగేలా చూడాలన్నారు. చల్లా ధర్మారెడ్డి భరతం పడుతామన్నారు ఈటల రాజేందర్. ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం, తర్వాత వాటిని మరిచిపోవడం సీఎం కేసీఆర్ కు అలవాటేనన్నారు. హుజురాబాద్ లో ఓడిపోతామని తెలిసే దళితులకు ఇంటికి 10 లక్షలు ఇస్తామంటున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *