మనవార్తలు ,జిన్నారం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ గాంధీ నగర్ కాలనీలో పరిధిలోని 1వ వార్డ్ కన్సిలర్ చంద్రయ్య ఆదివారం కాలనీలో పర్యటించి జరుగుతున్నా పలు అభివృధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమీషనర్ రాజేందర్ కుమార్, ఎఈ కిష్టయ్య పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి అండదండలతో కాంట్రాక్టర్ పనిలో నాణ్యత పాటించటం లేదు అని డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకుండా సిమెంట్, ఇసుకకి బదులుగా పూర్తి గా క్వాలిటీ లేని డస్ట్ వాడుతున్నారని. అందువల్ల కట్టే సమయంలోనే బూడిది లా రాలి పోతుందని అన్నారు. ఈ విషయం పై అధికారులను 17 లక్షల రూపాయల మున్సిపల్ నిధులు కేటాయించిన ఎందుకు పనిలో నాణ్యత ఉండటం లేదని నిలదీయగా పనులు జరుగుతున్నాయి కదా వాటికోసం మీకు ఎందుకు అని కౌన్సిలర్ అయ్యిన నాకు నిర్లక్ష్యంగా బడులిస్తునారు అని మండిపడ్డారు.వెంటనే ఈ పనులను మున్సిపల్ అధికారులు పరిశీలించి పనుల్లో నాణ్యత తీసుకునేటట్లు చూడాలని లేదంటే పనులను అడ్డుకుంటాం అని హెచ్చరించారు.