అంతర్గత విబేధాలు ఏమి లేవు సమన్వయ లోపమే – కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Hyderabad politics Telangana

మనవార్తలు , శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి దేవుని చెరువు వద్ద జరిగిన వివాదం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని, ఇది సమన్వయ లోపం వల్ల జరిగిన విషయమని దీన్ని సరిదిద్దుకొంటామని గచ్చిబౌలి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు.ఈ విషయం పై గోపన్ పల్లి లోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో. ఆయనమాట్లాడుతూ బిజెపి నాయకులు తీసుకున్న మీ సమస్య మా పరిష్కారం అనే కార్యక్రమంలో లో భాగంగా మా పార్టీ నాయకులు స్థానిక కార్పొరేటర్ నైనా నాకు కనీసం సమాచారం ఇవ్వకుండా చెరువుల సందర్శ కు వచ్చారనీ, ఒక చెరువుకు వెళ్లాల్సిన వాళ్ళు పొరపాటున నా ఆఫీస్ వద్ద ఉన్న చెరువు కు వచ్చి ఫోటోలు తీస్తుంటే కొందరు గ్రామస్తులు వచ్చి , ఇక్కడ మీకేం పని, ఫోటోలు ఎందుకు తీస్తున్నారని అడ్డుకోవడం జరిగిందని,

ఆక్రమంలో ఇరువర్గాలు గోడవజరగుతుందన్న సమాచారం రావడం తో పోలీసులకు సమాచారం ఇచ్చి గొడవ సద్దుమణిగేలా చేశామన్నారు. గ్రామస్తులకు మా పార్టీ నాయకులకు మద్య జరిగిన గొడవకు నాకు ఎలాంటి సంబంధం లేదని, కావాలని నా పై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని, నా డివిజన్ లో పార్టీ పటిష్టoగా ఉందని దీన్నీ ఓర్వలేక కొందరు మా మధ్య విబేధాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు.

ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని పార్టీ చూసుకుంటుందని తెలిపారు. నేను ఏ స్థలం కబ్జా చేయలేదని, ఇది మా తాత ముత్తా తాతల ఆస్తి అని, ఎన్నికలప్పుడు ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే గాంధీ దీని పై కలెక్టర్ కు, జి హెచ్ ఎం సి వాళ్ళకు పిర్యాదు చేస్తే అధికారులు ఇక్కడ ఎలాంటి కబ్జా జరగలేదని రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. ఏదిఏమైనా గొడవ జరగడం విచారకరమని ఈ విషం పై పార్టీలో చర్చించుకుంటామని, నాకు సంబంధం లేకపోయినా, స్థానిక కార్పొరేటర్ గా నేను వివరణ ఇస్తున్నట్లు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *