పటాన్చెరు:
సెప్టెంబర్ 2వ తేదీన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా పండుగ నిర్వహించాలని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెండో తేదీన నిర్వహించే జెండా పండుగ, పార్టీ సంస్థాగత నూతన కమిటీ లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్య ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేయోభిలాషులు, ప్రతి ఒక్కరూ పాల్గొనేలా చూడాలని సూచించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా మూలంగా పార్టీ జెండా పండుగ నిర్వహించలేక పోయామని, ఈ సంవత్సరం ఆనందోత్సాహాల మధ్య పండుగ వాతావరణంలో ప్రతి కార్యకర్త పాల్గొని కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు పార్టీ గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్ నూతన కమిటీలను ఎన్నుకోవాలి ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన మహత్తర బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నుముక అన్నారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలం అని, కార్యకర్తలను కుటుంబ సభ్యుల వలె చూసుకునే ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీలు ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్ పి టి సి సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, సుప్రజా వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, పార్టీ గ్రామ, మండల, డివిజన్, మున్సిపాలిటీల అధ్యక్షులు అఫ్జల్, పాండు, తలారి రాములు, ఈర్ల రాజు, పరమేష్ యాదవ్, దేవేందర్ యాదవ్, రాజేష్, నరేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.