– ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు బుక్స్ అందజేత
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
చిన్న వయసులోనే పెద్ద మనసుతో పేద విద్యార్థులకు సాయం చేయడం గొప్ప విషయమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ రావు తెలిపారు.టెక్ మహీంద్రా లో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న పేద విద్యార్థులు కు రాబోయే విద్యా సంవత్సరానికి ముందస్తు గా నోటు బుక్స్ అందజేయాలని సంకల్పం తో మాదాపూర్ ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదివే 200 మంది విద్యార్థులు కు ప్రత్యూష ఆమె మిత్రులు కల్సి బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన రావు, ఉపాద్యాయులు పాల్గొనీ
యువ దాతలను అభినందించినట్లు మోహన్ రావు తెలిపారు.