శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల కొండాపూర్ డివిజన్ లోని రాజరాజేశ్వరి కాలనిలో సర్వేనెంబర్ 78 నుండి 93 లో ప్లాట్ నెంబర్ 350 లో ఒక వ్యక్తి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జి ప్లేస్ 5 అంతస్థుల భవనం నిర్మిస్తుండగా కాలని అసోసియేషన్ తరుపున అధ్యక్షుడు విజయ్ కృష్ణ గత నెలలో జి హెచ్ ఎం సి అధికారులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయగా వారు నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటామని తెలిపి, కాలయాపన చేస్తున్నారని కాలని అధ్యక్షుడు విజయ్ కృష్ణ తెలిపాడు. సదరు అక్రమ నిర్మాదారున్ని ప్రశ్నించగా నేను ఎమ్మెల్యే మనీషిని, నాకు ఆయన సపోర్ట్ ఉందని, నా బిల్డింగ్ వద్దకు ఎవరు రావద్దని ఎమ్మెల్యే చెప్పారని పేర్కొంటున్నాడని, ఇలా అయితే కాలని మొత్తం అక్రమ నిర్మాణాలే ఉంటాయని, నేనేమి అతీతున్ని కాను అంటూనే ఎమ్మెల్యే పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 20 వ తేదీ నాడు అధికారులకు పిర్యాదు చేయగా, సదరు అక్రమ నిర్మాణదారునికి అదేరోజు నోటీసులు జారీ చేసినట్లు తెలిపి అనంతరం కంప్యూటర్ లో నుండి అధికారులు ఆ విషయాన్ని తొలిగించారని కాలని అధ్యక్షుడు ఆరోపించారు. ఇట్టి విషయంలో అధికారుల కాలయాపన, ఎమ్మెల్యే పేరు వాడుకున్నందుకు ఎమ్మెల్యే ను కూడా కలుస్తామని తెలిపాడు.ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తామని కాలని వాసులు హెచ్చరించారు.

