మన వార్తలు ,పటాన్ చెరు:
ఒక సంస్థ జయాపజయాలను వారి వ్యూహాత్మక పెట్టుబడి విధానాలు నిర్దేశిస్తాయని మీనాక్షి గ్రూపు చీఫ్ ఫెన్జాన్షియల్ అధికారి ( సీఎఫ్ ) డాక్టర్ ఎ.కిషోర్ చెప్పారు . పరిశ్రమ – విద్యాసంస్థల అనుసంధానం కార్యక్రమంలో భాగంగా , గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి సోమవారం ఆయన ‘ వారెన్ బఫెట్ పెట్టుబడి విధానం ‘ అనే అంశంపై ఆతిథ్య ఉపన్యాసం చేశారు . బెర్క్వెర్డ్ హాత్వే స్థాపనలో కార్పొరేట్ దిగ్గజం వారెన్ బఫెట్ పెట్టుబడి వ్యూహాలను ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు .
క్రియాశీల , నిష్క్రియాత్మక పెట్టుబడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతూ , బఫెట్ , ప్రొటీజ్ భాగస్వాములు , టెడ్ సీడ్స్ , జీఫ్రీ టారెంట్ల మధ్య పోటీని విడమరిచి చెప్పారు . అత్యంత ధనిక పెట్టుబడిదారుల పెట్టుబడి నమూనా గురించి ఉదాహరణతో సహా వివరించి విద్యార్థులను డాక్టర్ కిషోర్ ఆకట్టుకున్నారు . తొలుత , గీతం బీ – స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ అతిథిని స్వాగతించి , సత్కరించారు . అధ్యాపకులు ప్రొఫెసర్ కె.శశికుమార్ , డాక్టర్ సుధ , ప్రొఫెసర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు .