మనవార్తలు ,పటాన్ చెరు;
పటాన్ చెరు రైల్వే స్థలం ఒక చెత్త డంపింగ్ గా మారింది అని కార్మిక నాయకులు జనం పల్లి కమల్ అన్నారు .వందలాది స్కూల్ పిల్లలు ఆ దారి వెంట స్కూలుకు వెళ్తారు మార్కెట్ కమిటీ కూరగాయల చెత్త జిహెచ్ఎంసి చెత్త తో దారంతా నింపేశారు, పోవడానికి దారి లేక ఎంతో దూరం చుట్టూ తిరిగి పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు ,స్థానికంగా ఉన్న కాలనీలకు దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు చొలువ తీసుకొని ఇంత పెద్ద స్థలాన్ని ఒక క్రీడాస్థలంగా తీర్చిదిద్దాలని కమల్ అధికారులను కోరుతున్నారు.