Telangana

నోయిడా కార్మికుల న్యాయమైన డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలి

శాండ్విక్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి

అరెస్టు చేసిన నోయిడా కార్మికులను వెంటనే విడుదల చెయ్యాలి

లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చెయ్యాలి

నోయిడా కార్మికులకు సంఘీభావంగా శాండ్విక్ పరిశ్రమ వద్ద శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్లే కార్డులతో లతో నిరసన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

నోయిడా కార్మికుల న్యాయమైన డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలని,అరెస్టు చేసిన నోయిడా కార్మికులను తక్షణమే విడుదల చెయ్యాలని శాండ్విక్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత సీఐటీయూ పిలుపు మేరకు మంగళవారం డిమాండ్స్ డే పిలుపులో భాగంగా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమ ముందు శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ నోయిడాలో కార్మికవర్గ పోరాటాన్ని అణిచివేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న అక్రమ అరెస్టులు, మహిళా కార్మికులపై దాడులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్స్ కి అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ ను తెచ్చిందని, వాటి పర్యవసానమే కార్మికవర్గ పోరాటాలపై ఇలాంటి అణిచివేతలన్నారు. తక్షణమే లేబర్ కోడ్స్ ను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. నోయిడా కార్మికుల పోరాటానికి సీఐటీయూ తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ నాయకులు ఎమ్. మనోహర్, ఎ. వీరారావు, హెచ్. వెంకట్రావ్, వి. సదాశివ రెడ్డి, ఎమ్. సత్తిబాబు, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago