politics

కార్మికులకు తీవ్ర నష్టం చేసే లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వం కార్మికులను లేబర్ కోడ్స్ తో కట్టు బానిసలుగా మారుస్తారా

సిఐటియు పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ అతిమేల మానిక్

పాశమైలారం పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ నిబంధనలు నోటిఫైడ్ కాఫీల దగ్ధం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

కార్మికులను లేబర్ కోడ్స్ తో కట్టు బానిసలుగా మారుస్తాయని కార్మికులకు తీవ్ర నష్టం చేసే లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ అతిమేల మానిక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పాశమైలారం పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ నిబంధనలు నోటిఫైడ్ కాపీలను దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ వచ్చిందని అన్నారు 2019లో నుండి లేబర్ కోడ్స్ తెచ్చేందుకు ప్రయత్నం చేసిన కార్మిక వర్గ పోరాటాలతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అన్నారు. బిహార్ ఎన్నికల తర్వాత లేబర్ కోడ్స్ అమలు వేగవంతం చేసిందని,బెంగాల్ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రాగానే లేబర్ కోడ్స్ నిబంధనలు నోటిఫైడ్ చేసి అమలులోకి తెచ్చిందని ఆరోపించారు. లేబర్ కోడ్స్ తో 8 గంటల పని 12:00 గంటలకు జరుగుతుందని తీవ్ర పనిభారం కార్మిక వర్గం మీద పడుతుందని అన్నారు. పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు, యూనియన్ పెట్టుకునే హక్కుల పై తీవ్ర దాడి జరుగుతుందని తెలిపారు. లేబర్ కోడ్స్ కావని యాజమాన్యాల ప్రయోజనాల కోడ్స్ అన్నారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ రద్దు అయ్యేవరకు కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రాజు, నాయకులు వెంకటేష్, చంద్రయ్య, శ్రీనివాస్, ప్రభు, దుర్గయ్య, అన్నాజీ, వెంకటేశ్వరరావు, యాదయ్య, ఈశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago