_రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ కు ఫిర్యాదు
ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి :
ఎమ్మిగనూరు ముగతి మోహల్ల మజీద్ భూములను అన్య క్రాంతమ్ కాకుండ కాపాడాలని కోరుతూ ముగతి పేట మజీద్ పెద్దలు అల్ హజ్ తురేగల్ మొహమ్మద్ యూసుఫ్ లు మంగళవారం కర్నూలు కలెక్టరేట్ లో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ వేదిక గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ ను కలసి ఫిర్యాదును అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ముగతి మోహల్ల మజీద్ భూములను కాపాడాలని, ముగతి పేట మజీద్ కి సంబంధించిన భూమి నందవరం మండలం ముగతి గ్రామంలో 147/సి సర్వేనంబర్ లో 22.92 కలదని,ఈ భూమిని రెవెన్యూశాఖ అధికారులు అన్యాక్రాంతంగా ఇతరుల పేర్లు నమోదు చేసిన భూమిని వెంటనే మజీద్ పేరు మీద ఆన్లైన్ చేయవలసినదిగా కోరారు.అలాగే ఎమ్మిగనూరు మండలం రాళ్ళదొడ్డి గ్రామంలో 21 ఎకరాల వక్ఫ్ భూమి ని సర్వే చేసి స్వాధీనం చేయాలని ఫిర్యాదులో తెలిపారు.అలాగే ఏప్రిల్ నెలనుండి ఇమామ్ లకు మౌజాన్ లకు జీతలు రావటం లేదని, తక్షణమే మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలోడేగుల పాడు వలి, కటంబ్లీ షఫీ, ఖాజా. తురేగల్ మక్బుల్ బాష తదితరులు పాల్గొన్నారు.