మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల గచ్చిబౌలి డివిజన్ లోని గోపన్‌పల్లి పోచమ్మ దేవాలయంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నా ఆహ్వానాన్ని మన్నించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో పాటు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై, మా ఆతిథ్యాన్ని స్వీకరించి నందుకి ధన్యవాదాలు తెలిపారు. మీ చల్లని ఆశీర్వాదం మాపై ఉండాలని కోరుతున్నానని,. ఈ సందర్భంగా పోచమ్మ తల్లి ఆశీస్సులు కోరుతూ మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని, ఆ తల్లి దీవెనలు మీ అందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం లోనీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు,మహిళ నాయకులు ,మహిళ కార్యకర్తలు అనుబంధ సంఘాల ప్రతినిధులు ,అభిమానిలు మరియు ఆయా దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.