కనులు మిరిమిట్లు గొలిపిన ‘ఆటో షో’…

Telangana

– సాంకేతిక-సాంస్కృతికోత్సవాలతో సందడిగా మారిన గీతం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రమాణ-2023 గురువారం కనులు మిరిమిట్లు గొలిపిన ఆటో షోతో శ్రీకారం చుట్టుకుంది. దీనికితోడు వాయిద్య హోరు – కుర్రకారు హుషారు ప్రాంగణాన్ని సందడిగా మార్చింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆర్యన్ శర్మ (కిండ్స్ యునెటైడ్ ఇండియా) డాన్స్ వర్క్షాప్ విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపింది. ఇక ఆర్ట్ ఎటాక్, ఐడియాథాన్, హ్యాకథాన్లు విద్యార్థుల మేథకు పదును పెట్టాయి. వక్తృత్వ నైపుణ్యాన్ని వెలికితీసేలా యూత్ పార్లమెంట్, నూతన ఆలోచనలను ప్రేరేపించేలా ఒకరోజు వ్యవస్థాపకుడు కార్యక్రమాలు సాగాయి. మండల ఆర్ట్ శిక్షణ విద్యార్థుల సృజనాత్మకతను మరింత పెంచింది. షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన విద్యార్థుల్లోని దర్శకత్వ నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనలను వెల్లడించింది.

 

ఆడీ, బీఎండబ్ల్యూ, ఇసూజు, కియా వంటి అత్యాధునిక, ఖరీదెన కార్లు, బీఎండబ్ల్యూ, సుజుకీ ఇంట్రీడర్, హార్లీ డేవిడ్సన్, సీబీజెడ్, కవాసాకి వంటి బెక్టులు, రెండు సెక్షిళ్ళు ప్రాంగణంలో సందడి చేశాయి. హోరెత్తించాయి.బృంద నృత్యాలు, పాటలు, కీబోర్డు, వివిధ రకాల వాద్యపరికరాలతో సాంస్కృతి కార్యక్రమాలు హోరెత్తాయి. ఈ కార్యక్రమాల అనంతరం ‘బ్యాండ్ నెట్ – బ్యాండ్ ఎల్జియమ్’ పేరిట సాగిన విన్యాసం ప్రమాణకే తలమానికంగా నిలిచింది. ఆ తరువాత నిర్వహించిన ‘సెలెస్ట్రా-రన్వే కాంటెస్ట్’ సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, మెమరచిపోయేలా చేసింది. అధునాతన ఒరవడితో పాటు సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించిన వస్త్రాలు, లయబద్ధ సంగీతం అందరిలో ఉత్సాహాన్ని నింపింది. ప్రదర్శన ఆసాంతం కనువిందు చేసింది.

జంట నగరాల చుట్టుపక్కలున్న పలు కళాశాలల నుంచి తరలివచ్చిన దాదాపు ఐదారు వేల మంది విద్యార్థులు రెండవ రోజు ప్రమాణ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు అంశాలలో పోటీపడి తమ సామర్థ్యాన్ని పరీక్షించుకున్నారు. ప్రమాణ పేరిట నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల ఉత్సవాలు శుక్రవారం సాయంత్రం భారత్లోనే పేరొందిన ప్రముఖ డీజే లాస్ట్ స్టోరీస్, ఇటలీ నుంచి వస్తున్న ప్రపంచ ప్రసిద్ధ తెరి మికొ నిర్వహించనున్న సంగీత హోరు (ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ నెట్ / డీజే)తో ముగియనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *