మునిపల్లి
రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ,అదనపు కలెక్టర్ వీరారెడ్డి , సిబ్బంది తో కలిసి మంగళవారం నాడు మునిపల్లి మండలం పరిధిలోని గ్రామాల రైతులకు సంబంధించిన ధరణి భూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.తహశీల్దార్ల కార్యాలయంలో కంప్యూటర్ లు ఏర్పాటు చేసి ధరణి జి ఏల్ ఏo లో వచ్చిన అర్జీలు,భూముల వివరాలు పరిశీలించారు. పట్టా భూములు ఉన్న రైతుల సమస్యలను అక్కడికి అక్కడే పరిష్కరించేo దుకు చర్యలు తీసుకున్నారు.భూముల వివరాలు నిషేధిత ప్రభుత్వ ఇతర జాబితాలో చేరితే వాటిని సరిదిద్దుతామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.ఈ పరిశీనలో జిల్లా సర్వే అధికారి మధుసూదన్, ఆర్డీవో నగేష్ , డిప్యూటీ తహసీల్దార్ వెరేశం తదితరులు పాల్గొన్నారు.