ఇంజనీరింగ్ విభాగాల మధ్య సరిహద్దులను చెరిపివేయాలి

Telangana

-గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన ఎంఐటీ ప్రొఫెసర్ నీలిమ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఇంజనీరింగ్ విభాగాల మధ్య సరిహద్దులను చెరిపివేయాలని, సంక్లిష్ట వ్యవస్థల్లోని వివిధ కారకాలు, పరస్పర చర్యలకు సమగ్ర పరిష్కారాలను అభివృద్ధి చేయాలని మణిపాల్, ఎంఐటీలోని సీఎస్ఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నీలియా బయ్యవు సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేథ యుగంలో అంతర్ విభాగ పరిశోధన, హెచ్ పీసీ ‘ అనే అంశంపై గురువారం ఆమె అతిథ్య ఉపన్యాసం చేశారు. కృత్రిమ మేథ యుగంలో సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడంలో, ఆవిష్కరణలను నడపడంలో అంతర్ విభాగ సహకారం యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ నీలిమ నొక్కి చెప్పారు. సమాజ అవసరాలు, వృద్ధి పథాన్ని సంగ్రహించడం, అధిక పనితీరు గల కంప్యూటింగ్, నెల్లిక పరిగణనలు, సంఘంతో మమేకమవడం వంటి వాటిని ఆమె వివరించారు. తమ బంగారు భవిష్యత్తు కోసం కృత్రిమ మేథ పనిభారం కోసం ప్రత్యేక హార్డ్ వేర్ నిర్మాణాలను అభివృద్ధి చేయడంపై ఈసీఈ విద్యార్థులు దృష్టి సారించాలని డాక్టర్ నీలిము సూచించారు. పనితీరు, శక్తి సామర్ధ్యాలను మెరుగుపరచడానికి టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్లు, స్నెకింగ్ న్యూరల్ నెట్ వర్క్స్ ల వంటి కృత్రిమ మేథ వేగం పెంచడం కోసం నూతనడిజైన్ లను అన్వేషించాలన్నారు. తక్కువ శక్తితో నడిచే కృత్రిమ మేథ ప్రాసెసింగ్ యూనిట్లు, హెచ్ పీసీ కోసం అత్యంత వేగవంతమైన ఇంటర్ కనెక్టులు , కృత్రిమ మేథ-హెచ్ పీసీ ల అనుసంధానం కోసం మెమురీ ఆర్కిటెక్చర్లు, కృత్రిను మేథ ఆధారిత చిల్ల రూపకల్పనతో పాటు విశ్వసించదగ్గ భద్రతం గురించి నేర్చుకోవాలన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి అతిథిని సత్కరించగా, ఈఈసీఈ విభాగాధిపతి. ప్రొఫెసర్ టి.మాధవి స్వాగతించారు. ప్రొఫెసర్ పి. త్రినాథరావు వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *