మనవార్తలు ,పటాన్ చెరు
బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్సీ కార్యచరణ ప్రణాళిక ఉంటుందని బీఎస్సీ పటాన్ చెరు ఉపాధ్యక్షులు ప్రవీణ్, సతీష్ లు అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో బహుజన సమాజ్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పటాన్ చెరు ఉపాధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలోతెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బహుజన సమాజ్ పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షులు జి.సతీష్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాలను పక్కకుపెట్టి దొరల తెలంగాణగా మార్చాడని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంలో బడుగు , బలహీన వర్గాలకు చోటులేదన్నారు .తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసేందుకు యువత కలిసిరావాలని కోరారు. దొరల పాలనలో బీసీ,ఎస్సీ,ఎస్టీ , మైనార్టీ కులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సభలు , సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మార్పు కోసం ప్రతి ఒక్కరు కలిసి రావాలని ప్రవీణ్ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్సీ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని రెండేళ్ళలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ ప్రతిష్టపర్చాల్సి న అసవరం ఉందన్నారు .ప్రతి ఒక్కరూ బూత్ స్థాయికి వెళ్ళి బీఎస్సీ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ముఖ్యంగా పటాన్ చెరు నియోజకవర్గంలో పేదలంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు .
ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి సతీష్, జిల్లా కార్యదర్శి , పటాన్‌చెరు అసెంబ్లీ ఇంచార్జి కె సంజీవ, పటాన్చెరు అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ప్రవీణ్, జిల్లా EC సభ్యులు నర్శింహా, జిహెచ్ఎంసి 111 భారతీనగర్ డివిజన్ అధ్యక్షుడు పి శ్రీశైలం, 113 పటాన్చెరు డివిజన్ అధ్యక్షుడు మహేందర్, పటాన్చెరు మండల కన్వీనర్ వెంకటేష్,అమీన్‌పూర్ మండల కన్వీనర్ చంద్రశేఖర్,తెల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు దర్శన్ మరియు ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ నాయక్, సచిన్, పృథ్వీ, సోలోమన్ తో పాటు బీఎస్పీ ముఖ్య నేతలు ,
సిద్ది రాములు, జనార్ధన్. తదితరులు పాల్గొన్నరు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…