పటాన్ చెరు:
గీతం సొసైటీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి 88వ జయంతి సందర్భంగా శనివారం గీతం విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రాంగణంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు . శివాజీ ఆడిటోరియం ముందు ఏర్పాటు చేసిన డాక్టర్ మూర్తి చిత్రపటానికి పూలు చల్లి గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్, సంయుక్త కార్యదర్శి ఎం.భరద్వాజ్, అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ తదితరులు అంజలి ఘటించారు.
గీతం హైదరాబాద్ రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, విద్యార్థి వ్యవహారాల సంచాలకుడు ప్రొఫెసర్ ఏ.శ్రీరామ్, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సునీల్ కుమార్, ఎస్టేట్ అధికారి ఎం.మోహన్, పలువురు అధ్యాపకులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.