నిందితుడిని కఠినంగా శిక్షించాలి…
– శివ రెడ్డి ఐనోల్ గ్రామ యువ నాయకులు
పటాన్ చెరు:
గిరిజన బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని శివ రెడ్డి ఐనోల్ గ్రామ యువ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఐనోల్ గ్రామంలో శివ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని గాంధీ స్థూపం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి, నిం దితుడిని శిక్షించాలని నిరసన కార్యక్రమం చేప ట్టారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
దేశం,రాష్ట్రంలో బాలికలు , మహిళలు , విద్యార్థినులకు రక్షణ కల్పించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు . ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అనేకం జరిగిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.అనేక చట్టాలు తీసుకువచ్చినప్పటికీ చట్టాలు చుట్టాలుగా మారిపోయాయి తప్ప .. అమలు చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు విఫలం అవుతు న్నాయన్నారు.నిర్భయ చట్టాలను అమలు చేసి నిందితుడికి శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసు కోవాలన్నారు.లేదంటే యువత అంతా ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు.