మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
ఎన్నికల సంఘం ఈ సి ఐ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలమురళి కృష్ణ చిన్న ముదిరాజ్ అన్నారు.ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనాన్ని ఉటంకిస్తూ ఆయన మాట్లాడుతూ, గత పది నెలల కాలంలో ఓటర్ల జాబితా సవరణ, ఫారం-6లో మార్పులు, ఈసీఐనెట్ కేంద్రీకరణ వంటి కీలక అంశాలపై ఇతర ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కనీసం 14 సందర్భాల్లో అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.మూడు సభ్యులతో కూడిన రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం ఒకే వ్యక్తి నిర్ణయాలకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడకూడదని బాలమురళి కృష్ణ అన్నారు. ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, సంబంధిత 14 అసమ్మతి లేఖలను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఓటర్ల జాబితా సవరణ, కేంద్రీకృత సాఫ్ట్‌వేర్ వ్యవహారాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించాలంటే ఎన్నికల సంఘం తన నిర్ణయాలు, అంతర్గత అభ్యంతరాలు, విధానపరమైన మార్పులపై పారదర్శకంగా వ్యవహరించాలని బాలమురళి కృష్ణ అన్నారు.
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…
ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…