Telangana

రసాయన శాస్త్రంలో ప్రేరణ లూంబాకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ప్రేరణ లూంబా డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘అమ్మోనియా, ఎసిటిలీన్ కోసం మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్ వర్కు (MOF), కోవలెంట్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్కు (COF) పదార్థాల సంశ్లేషణ, లక్షణాల పరిశీలన, గది ఉష్ణోగ్రత వద్ద వాయువును గుర్తించే పనితీరు’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎం.ఎస్. సురేంద్ర బాబు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.అమ్మోనియా, ఎసిటిలీన్ వంటి ప్రమాదకరమైన వాయువులను సున్నితంగా, ప్రత్యేకంగా గుర్తించడం కోసం, పోరస్ మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్ వర్కులు (ఎంవోఎఫ్ లు), కోవలెంట్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్కులు (సీవోఎఫ్ లు) రూపకల్పన, అభివృద్ధిపై ఆమె డాక్టరల్ పరిశోధన కేంద్రీకృతమై ఉందని తెలియజేశారు.

ఈ అధ్యయనం, షిఫ్ బేస్-ఉత్పన్న, మెటల్-డోప్డ్ ఫ్రేమ్ వర్కుల యొక్క అసాధారణమైన సెన్సింగ్ పనితీరు, స్థిరత్వం, ఎంపిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు. పర్యావరణ పర్యవేక్షణ, పారిశ్రామిక భద్రత, ప్రజారోగ్యంలో వీటికి వినియోగిస్తున్నట్టు తెలిపారు.ఈ పరిశోధనలో, నిర్దిష్ట వాయువులను గుర్తించడం కోసం Zn(TDA) and Co(TDA) MOFs, బహుళ లోహ కేంద్రాలు కలిగిన అధిక-ఎంట్రోపీ ఎంవోఎఫ్ లు, జింక్-డోప్డ్ సీవోఎఫ్ ల అభివృద్ధి ఉన్నాయన్నారు. అధునాతన డీఎఫ్టీ అధ్యయనాలు ఈ పదార్థాల మెరుగైన సెన్సింగ్ విధానాలను, ఎలక్ట్రానిక్ లక్షణాలను మరింతగా ధృవీకరించాయని వివరించారు.

డాక్టర్ లూంబా సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, రసాయ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పరిశోధనకు ఆమె చేసి గణనీయమై కృషిని అభినందించినట్టు తెలిపారు. డాక్టరేట్ పరిశోధన అంతటా అంకితభావంతో మార్గనిర్దేశనం చేయడంతో పాటు సలహాలు అందించినందుకు ప్రొఫెసర్ ఎం.ఎస్. సురేంద్ర బాబును కూడా ప్రశంసించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

16 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

19 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

21 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

21 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

21 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago