మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
టెన్త్ విద్యార్థులు భయం వీడి పరీక్షలు బాగా రాయాలనీ విద్యా హై స్కూల్ ప్రిన్సిపాల్ త్రిమూర్తులు అన్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోనీ అంజయ్య నగర్ లో గల విద్యా హై స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతూ సంవత్సరం పొడువునా చదివిన విద్యార్థులు చాలా మంది ఎగ్జామ్స్ అనగానే ఒక విధమైన భయానికి లోనవుతారని, తాము నేర్చుకున్న ఆన్సర్లు వస్తాయో రావో అనే సందేహాలతో నేర్చుకున్నవి కూడా మర్చిపోయే ప్రమాదం ఉందన్నారు. ఎలాంటి భయం కానీ తొందరపాటు కానీ పడకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత చదువులు చదువుకోవడానికి ఇది తొలి మెట్టు అని, ఏ రంగం ఎంచుకోవాలన్నా టెన్త్ చాలా కీలమైందని, కాబట్టి బాగా చదుకోని, అన్ని రకాలుగా ప్రిపేర్ అవ్వాలని సూచించారు. విద్యార్థులదరు మంచి మార్కులు సాధించాలని, అందుకు వారందరికీ ఆల్ ద బెస్ట్ అని అయన తెలిపారు.