మన వార్తలు ,పటాన్చెరు:
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పఠాన్ చేరు లోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి పఠాన్ చేరు జెపి కాలనీ లోనిఉమా మహేశ్వర ఆలయం లో తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు భక్తలు. భారీగా తరలివచ్చిన మహిళలు. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి అంటేకార్తీక పూర్ణిమ రోజున నదీ స్నానం చేసేందుకు ఎక్కువగా భక్తులు ఆసక్తిని చూపుతారని . నదీ స్నానం చేయడం వలన అనేక పాపాలు తొలిగిపోతాయని భక్తులు నమ్ముతారని ఈ రోజు అనేక మంది తమకు తోచిన దానాలను ఇస్తారు. అలాగే దీపాలను కూడా దానం చేస్తారు. ఇలా చేయడం వలన పుణ్యఫలం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం అందుకోసమే కార్తీక పౌర్ణమి రోజున మనం ఏ దేవాలయాలు చూసినా ఇసుకేస్తే రాలనంత జనాలతో కిక్కిరిసి పోయి ఉంటాయి. ఇలా కార్తీక పౌర్ణమిని భక్తులు అధిక భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆలయ నిర్వాహకులు తెలిపారు .