కారుణ జన్మడు కేసీఆర్
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ శ్రేణులు పటాన్చెరులో ఘనంగా నిర్వహించాయి. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసిన గొప్ప మహనీయుడు కేసిఆర్ అని అన్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
