సంగారెడ్డి జిల్లా
పటాన్చెరు
కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన హక్కులను సాధించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర వీరబద్రియ కుల సంఘం రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వీరబద్రీయ కుల సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు . నూతన సంఘం సభ్యులకు రాష్ట్ర కమిటీ సంగారెడ్డి జిల్లా కమిటీ సమక్షంలో అనుబంధ పత్రం ఇచ్చారు. రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ నూతన కమిటీ సభ్యులకు ముత్తంగి కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర కమిటీ ముఖ్య సలహాదారులు చెవ్వా ఎల్లయ్య , రాష్ట్ర అధ్యక్షులు చెవ్వా పాండు ,జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు చెవ్వా అంజయ్య , రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి లక్ష్మణ్ , రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నె సురేందర్ ,రాష్ట్ర యూత్ అధ్యక్షుడు చెవ్వా వెంకటేష్ ,జిల్లా అధ్యక్షులు అగుళ్ల మల్లేష్ , స్థానిక మండల అధ్యక్షులు పఠాన్ చెరువు,అమీన్ పూర్,రామచంద్రపురం,సదశివపేట అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కుల సంఘాలు బలంగా ఉంటే రాజ్యాధికారంలోను మన వాటా దక్కించుకోవచ్చని సంఘం నేతలు అన్నారు .