పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
సీఎం కేసీఆర్ అకుంటిత దీక్ష, మొక్కవోని పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం అయిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తొలి దశ ఉద్యమం నాటి నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి తెలంగాణ సమాజంలో ఉన్న పడి ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు 10 సంవత్సరాల కాలంలో బంగారు తెలంగాణగా రూపాంతరం చెందుతోందని ఆనందం వ్యక్తం చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని అభివృద్ధికి ప్రత్యేకంగా నిలుపుతున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
