మనవార్తలు , శేరిలింగంపల్లి :
తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో త్వరలోనే ముదిరాజ్ ల ఆత్మ గౌరవ పాద యాత్ర ను చేపట్టనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ముదిరాజ్ లు అణచివేతకు గురి అవుతున్నారని.ముదిరాజ్ ల మనోభావాలను దెబ్బ తీసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో , తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముదిరాజ్ లను బీసీ డీ నుండి బీసీ ఏ కి మార్చాలని ,బీసీ కమిషన్ వేసి ముదిరాజ్ ల యొక్క సమగ్ర నివేదికను బీసీ కమిషన్ ద్వారా సుప్రీం కోర్టుకు పంపించాలని ఎన్నో సార్లు ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.
అయిన ఈ ప్రభుత్వం ముదిరాజ్ ల సమస్య ను పట్టించుకోకుండా బీసీ కమిషన్ ద్వారా ముదిరాజ్ ల రిపోర్ట్ ను సుప్రీం కోర్టు కు పంపించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం లో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ లకు జనాభా ధమాశ ప్రకారం చట్టసభల్లో ముదిరాజ్ లకు కేటాయించాల్సిన సీట్లు కేటాయించకుండా పార్టీ లు అన్యాయం చేస్తున్నాయని అన్నారు.
ముదిరాజ్ ల హక్కుల సాధన కోసం, ముదిరాజ్ ల ఆత్మ గౌరవ పాద యాత్ర ను ముదిరాజ్ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో త్వరలోనే చేపట్ట బోతున్నమని. కరోనా ,ఒమిక్రాన్ ప్రభావం తగ్గగానే మా పాదయాత్ర ను ప్రారంభిస్తామని ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ తెలియజేశారు.