విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానం సంపాదించుకోవాలి తహసీల్దార్ రాజయ్య

Districts Telangana

సంగారెడ్డి,మనవార్తలు ప్రతినిధి :

గురుకుల పాఠశాల విద్యార్థులు కార్పోరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అత్యుత్తమ జీపీఏలతో ఉత్తమ ఫలితాలు సాధించాలని పుల్కల్ మండల తహసీల్దార్ రాజయ్య అన్నారు . సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్థానిక తహసీల్దార్ రాజయ్య చేతుల మీదుగా బస్వాపూర్ ఎర్రగోల్ల చంద్రశేఖర్, ప్రవీణ్, సాయి రాజ్ పరీక్ష ప్యాడ్ అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు వార్షిక పరీక్షల్లో విధ్యార్థులు అత్యుత్తమ జిపిఎలతో ఉత్తమ ఫలితాలు సాదించాలని ఆకాంక్షించారు . ఉన్నత విద్య ద్వారానే ఉత్తమమైన జీవితాలు లభిస్తాయని, చదువులపై శ్రద్ధ వహించాలన్నారు . పరీక్షలకు భయపడకుండా ఉపాధ్యాయలు చెప్పిన పాఠాలను రివిజన్ చేసుకుంటూ .అత్యుత్తమ జి.పి.ఎ లను లక్ష్యంగా చేసుకోవాలన్నారు . ఉపాధ్యాయులు సైతం విధ్యార్థుల్లో మరింతి స్పూర్తి కలిగించి ప్రోత్సహించాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కార్పోరేట్ విద్య సంస్థలతో పోటీగా విద్యను అందించేందుకు అడుగులు వేస్తుందన్నారు .మన ఊరు-మన బడి లాంటి కార్యక్రమాలతో ప్రభుత్వ బడుల్లో మౌళిక సదుపాయాల కల్పన , ఆటా పాటలతో కూడిన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తుందన్నారు .పరీక్షల్లో పాస్ , ఫెయిల్ అనేవి సాధారణమని తహసీల్దార్ రాజయ్య అన్నారు .విద్యార్థులు మంచిగా చదువుకున్న ఉన్నత స్థానం సంపాదించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పదవ తరగతి చదవని సమాజంలో మంచి స్థితిలో ఉన్నారని వారు తెలిపారు. అనంతరం తహసీల్దార్ రాజయ్య ,చంద్రశేఖర్ ,ప్రవీణ్, సాయి రాజ్ లను ఉపాద్యాయ బృందం శాలువాలతో  సత్కరించారు . ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ జీవితంలో మంచి స్థాయికి రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ రాజయ్య ,ఎర్రగొల్ల చంద్రశేఖర్, సాయి రాజ్ ,ప్రవీణ్ ఉపాధ్యాయలు మల్లిఖార్జున్, ఉదయ్ కుమార్ ,జెలిల్ కృష్ణ శ్రీపాద్ ,చెన్నయ్య ,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *