– గీతమ్ లో నిర్వహించిన ఫార్మా కాంక్టేన్లో స్పష్టం చేసిన వక్తలు.
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఫార్మాస్యూటికల్ రంగం ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన మార్పులను చవిచూసిందని, దాని భవిష్యత్తును రూపొందించడంలో నూతన సాంకేతికలు కీలక పాత్ర పోషించనున్నట్టు పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ని కెరీర్ గెడ్లైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ‘ఫ్నా భవిష్యత్తు- తక్షణ ఆవశ్యకత’ అనే ఇతివృత్తంతో శుక్రవారం ఫార్మా కాంక్లేన్-2023″ ని నిర్వహించారు.ఫార్మా పరిశ్రమ నిపుణుల ఆలోచనలు తెలుసుకుని, పరిశ్రమ – విద్యారంగం మధ్య అంతరాన్ని తగ్గించడం, మెరుగైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేసి అత్యాధునిక పరిశోధనలో సహకరించుకోవడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. పరిశ్రమ అధినేతలు, నిపుణులతో సహా విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆ రంగంపై లోతెన విశ్లేషణతో పాటు మెరుగైన భవిష్యత్తు కోసం పలు సూచనలు చేశారు.
ఫార్మా పరిశ్రను వృద్ధిలో సాంకేతికత పాత్రను గ్రాన్యూల్స్ ఇండియా ముఖ్య మానవవనరుల విభాగ అధికార ఉమారావు నొక్కిరిస్తారు, ఫార్మా పరిశ్రమ ప్రపంచ మార్కెట్ ఆదాయం 2031 నాటికి సుమారు 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, ఉద్యోగ అవకాశాలు రెండు శాతం, డేటా సెలో 21 శాతం, అమ్మకాలలో నాలుగు శారం వృద్ధి ఉంటుందని ఆమె అంచనా వేశారు. ఫార్మా వృత్తిలో అభివృద్ధి చెందడానికి బృందాలతో కలిసి పనిచేయడం, నాయకత్వం వహించడం, సమస్యలకు పరిష్కారాలు చూపడం, సాంకేతిక విశ్లేణాత్మక ఆలోచన, బలమైన సంఖ్యా నెణ్యాలను మెరుగుపరచుకోవడం అవసరమని సూచించారు.ఫార్మా పరిశ్రమలో అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలతో పాటు ఆశాజనకమైన కెరీర్ అవకాశాల గురించి. యోనాతా ఫార్మా ఉపాధ్యక్షుడు ( నాణ్యత-ఫిర్యాదులు) తిలక్ కుమార్ షా వివరించారు.
ఫార్మా పరిశ్రమలో అనిషద్రం ఆవశ్యకత, ఉపాధి అవకాశాలని అంతరృష్టులు, అందుకు తగ్గట్లుగా విద్యార్థులు ఎలా సమాయత్తం కావాలో నోవార్టిస్లోని రెగ్యులేటరీ డిరెక్టర్ డాక్టర్ సుభాస్ చంద్ర మహాపాత్ర తెలిపారు.పరిశోధనంపై ఫార్మా పరిశ్రమ మరింత దృష్టి సారించాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ బగత్తరణ్ డాస్ విజ్ఞప్తి చేశారు, రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా ఎదుగుతూ, ఎగురుతుల చేసే స్థాయికి చేరుకుందని, ఫార్మా పరిశ్రమకు కూడా ఆ రోజు రావాలని ఆయన ఆకాంక్షించారు.
సెంటర్ ప్రొఫెసర్ నాతి నేలకుమార్ మాట్లాడుతూ, ఫార్మా పరిశ్రమలోని నిపుణుల మధ్య విజ్ఞాన మార్పిడి సాధాన్యాన్ని నొక్కిచెప్పారు.అరబిందో ఫార్మా, హెటిరో, ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్, శ్రీకృష్ణ, ఫార్మా, టెక్ మహీంద్రా, శిల్పా మెడికేర్తో సహా పలు కంపెనీల ఉన్నతాధికారులు ఈ కాంక్లేవ్ లో పాల్గొన్నారు.గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ సీఎస్, డాక్టర్ రమాకాంత్ బాబ్ స్వాగతోపన్యాసం చేయగా, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జేఎస్ కుమార్ వందన సమర్పణ చేశారు.